ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ మరోసారి సత్తా చాటింది. ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకుంది. అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరిన అమెరికన్ కోకో గాఫ్‌పై స్వియాటెక్ ఘనవిజయం సాధించింది. ప్యారిస్‌లోని కోర్ట్ ఫిలిప్లపే ఛాట్రియర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోకోపై 6-1, 6-3తో సూపర్ విక్టరీ నమోదు చేసింది.
ఒక గంటా 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ విజయం సాధించింది. ఇది ఆమెకు వరుసగా 35వ విజయం కావడం గమనార్హం. స్వియాటెక్ వేగాన్ని అందుకోవడానికి కోకో చాలా కష్టపడింది. 2020లో స్వియాటెక్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన సంగతి తెలిసిందే.