పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ ఫెవరేట్లలో ఒకరైన ఇగా స్వియాటెక్ ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో స్వియాటెక్ 6-2, 7-5తో జాక్వెలిన్న అడిన్పై అలవోక విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆది నుంచే తనదైన ఆధిపత్యం ప్రదర్శించిన ఐదోసీడ్ స్వియాటెక్ వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్, బెలారస్ బ్యూటీ ఎరీనా సబలెంక నాలుగో రౌండ్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో సబలెంక 6-2, 6-3తో ఓల్గా డానిలోవిచ్(సెర్బియా)పై గెలిచింది. జాంగ్ 6-3, 6-4తో విక్టోరియా బొకోపై, పౌలిని 6-4, 6-1తో యులియాపై గెలిచి తదుపరి రౌండ్లలోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యుకీ భాంబ్రీ-రాబర్ట్ ద్వయం 6-7(4), 7-6(7), 6-3తో నికోల మెక్టిక్, మైఖేల్ వీనస్ జోడీపై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు.