ముంబై : ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆ సిరీస్‌లో ఒకవేళ కోహ్లీ రాణిస్తే అతని ఖాతాలో ఓ కొత్త రికార్డు చేరనున్నది. 2025 చాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగిస్తే అప్పుడు అతను రికార్డు పుస్తకాల్లో ఎక్కడం ఖాయం అవుతుంది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో ప్రస్తుతం కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నాడు. ఒకవేళ అతను రాబోయే వన్డే సిరీస్‌లో మరో 54 పరుగులు చేస్తే, అప్పుడు అతను రెండోవ స్థానానికి చేరుకుంటాడు. వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
హ్లీ ఇప్పటి వరకు 302 వన్డేలు ఆడాడు. వాటిల్లో అతను 14,181 రన్స్ చేశాడు. సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 18,426 రన్స్ చేశాడు. ఇక సంగక్కర 14,234 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మరో 54 పరుగులు చేస్తే, ఆల్ టైం లిస్టులో అతను రెండవ స్థానానికి చేరుకుంటాడు. అయితే ఏడు నెలల బ్రేక్ తర్వాత కోహ్లీ మళ్లీ వన్డేలు ఆడుతున్నాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీలోఅతను 54 సగటుతో 218 రన్స్ స్కోరు చేశాడు. టీ20, టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అతను వన్డే ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టాడు.
ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ 29 వన్డేలు ఆడాడు. వాటిల్లో కోహ్లీ 1327 రన్స్ స్కోరు చేశాడు. దాంట్లో అయిదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీలు ఉన్నాయి.