CWC 2023: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో ఇదివరకే సెమీస్ చేరిన భారత క్రికెట్ జట్టు ఈనెల 15న న్యూజిలాండ్‌తో తొలి సెమీస్ ఆడనుంది. టోర్నీ ఆసాంతం ఆడిన ఎనిమిదింటికి గాను 8 మ్యాచ్‌లలో గెలిచి జోరుమీదున్న టీమిండియా ఈసారి కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. భారత్‌కు ప్రపంచకప్ సాధించడానికి ఇదే మంచి తరుణమని, ఇప్పుడు దాటితే టీమిండియా మళ్లీ వరల్డ్ కప్ సాధించాలంటే మూడు ప్రపంచకప్‌లు వేచి చూడాలని కామెంట్ చేశాడు.
మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైఖేల్ వాన్లతో కలిసి ఓ వీడియో చాట్‌లో శాస్త్రి మాట్లాడుతూ.. ‘భారత్ ఈసారి గనక ప్రపంచకప్ మిస్ అయింతే మళ్లీ ఆ దిశగా టీమిండియా సాగాలన్నా, వరల్డ్ కప్ గెలవాలన్న ఆలోచన రావాలన్నా మూడు టోర్నీల దాకా వేచి చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం జట్టులో ఏడెనిమిది మంది ప్లేయర్లు అత్యద్భుత ఫామ్‌లో ఉన్నారు. పేస్ అటాక్ దుర్బేధ్యంగా ఉంది. స్సిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు మిడిల్ ఓవర్స్ లో బాగా కట్టడి చేస్తున్నారు. గడిచిన 50 ఏండ్లలో వైట్ బాల్ క్రికెట్లో నేను చూసిన బెస్ట్ బౌలింగ్ అటాక్ ఇదే..’ అని తెలిపాడు.