బెకెన్హామ్: ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టులో యువ భారత్ భారీ స్కోరుతో అదరగొట్టింది. ఓవర్నైట్ స్కోరు 450/7తో రెండో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత అండర్-19 టీమ్ 540 పరుగులు చేసింది.
ఓవర్నైట్ బ్యాటర్లు అంబరీశ్(70) అర్ధసెంచరీతో కదంతొక్కగా హెనిల్ పటేల్(38) ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని సమర్థంగా నిలువరిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. అలెక్స్ గ్రీన్(3/74), రాల్ఫీ అల్బర్ట్(3/95) మూడేసి వికెట్లు తీశారు.