Sheik Hasina | పెళ్లి రోజు ఎవరికైనా మధుర జ్ఞాపకమే. కానీ, అదే రోజు జీవితం తలకిందులైతే భరించలేరు ఎవరైనా. ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hasina)కు అదే పరిస్థితి ఎదురైంది. అవును.. ఆమె పెళ్లి రోజు చివరకు జీవితంలో చీకటి రోజుగా మారింది. ఢాకా అల్లర్లకు బాధ్యురాలిగా ఆమెకు అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ICT) కోర్టు సోమవారం నవంబర్ 17న మరణ శిక్ష విధించింది. సరిగ్గా 58 ఏళ్ల క్రితం ఇదే రోజు హసీనా వివాహం జరిగింది. 1,400 మంది మృతికి కారణమయ్యారని మాజీ ప్రధానికి మ్యారేజ్ యానివర్సరీ రోజే ఉరి ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఆమె పశ్చాత్తాపం పడాలనే ఉద్దేశంతోనే తీర్పు తేదీని నవంబర్ 14 నుంచి 17కు మార్చారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడైన షేక్ ముజిబుర్ రెహ్మాన్(Sheikh Mujibur Rahman) వారసురాలైన షేక్ హసీనా తండ్రిలానే రాజకీయాల్ని పుణికిపుచ్చుకున్నారు. ఆయన మరణం తర్వాత అవామీ లీగ్ బాధ్యతలు చేపట్టిన ఆమె.. 1996లో బంగ్లాదేశ్ ప్రధాని పదవి చేపట్టారు. మొదట్లో జనాకర్షక నేతగా ప్రశంసలు అందుకున్న ఆమె.. పదిహేనేళ్లు పదవిలో ఉండడంతో నియంతగా ప్రవర్తించడం మొదలెట్టారు. అయితే.. 1971లో జరిగిన బంగ్లా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి బంధువులకు సివిల్ ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తన మెడకు చుట్టుకుంటుందని అస్సలు ఊహించలేదామె. ఈ నిర్ణయంతో జనంలో తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబికింది.
The Historic Moment the Whole Nation Has Been Waiting For: Hasina Is Sentenced to Death for Crimes Against Humanity During the July Mass Uprising#sheikhhasina #centristnationtv pic.twitter.com/b5NsSYtdQR
— Centrist Nation TV (@centristnattv) November 17, 2025
యూనివర్సిటీ విద్యార్దులు శాంతియుతంగా నిరసనకు దిగారు. క్రమంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దాంతో.. ఆందోళనకారులను అణిచివేసేందుకు వారిని చంపడానికైనా వెనుకాడవద్దని హసీనా ఆదేశించిందని ఆరోపించింది నోబెల్ గ్రహీత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం. హసీనాపై నమోదైన అభియోగాలపై అక్టోబర్ 23న విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్ర్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పును మొదట నవంబర్ 14న వెల్లడిస్తామని తెలిపింది. అయితే.. అనూహ్యంగా తీర్పు తేదీని నవంబర్ 17కు మార్చింది.
వాజెద్, హసీనా పెళ్లినాటి ఫొటో

న్యూక్లియర్ సైంటిస్ట్ ఎంఏ వాజెద్ మియా (Wazed Miah)ను 1967లో ఇదే రోజున హసీనా పెళ్లి చేసుకున్నారు. మొదట్లో కరాచీలోని అణుపరిశోధక సంస్థలో పనిచేసిన ఆయనను బంగ్లా విమోచన పోరాటానికి ముందే పాక్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈస్ట్ బెంగాల్(ప్రస్తుత బంగ్లాదేశ్)కు తిరిగొచ్చిన వాజెద్.. స్వాతంత్య్రం తర్వాత బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్‌లో సేవలందించారు.
Kerre Indian dalal. Sheik Hasina is directly killed tortured and kidnapped more than 2 million people in the last 17 years. She must be hanged pic.twitter.com/ujahavKIgm
— Nasim Iqbal (@NasimIqbal41013) October 25, 2025
‘నవంబర్ 17 హసీనా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. 1967లో ఆమె పెళ్లి రోజు అదే. 2025 ఆమెకు మరణశిక్ష పడిన రోజు కూడా అదే’ అని బంగ్లాదేశ్‌లోని సెంట్రిస్ట్ నేషనల్ టీవీ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ‘వ్యక్తిగతంగా ప్రత్యేకమైన సందర్భం నుంచి చరిత్రాత్మకమైన కోర్టు తీర్పు వరకూ’ అని ది హెడ్‌లైన్స్ అనే మీడియా సంస్థ పేర్కొంది. ఈ పోస్ట్‌లపై బంగ్లాదేశీయులు చాలామంది స్పందిస్తున్నారు. ‘హసీనా పై ప్రతీకారంగానే ఈ తేదిని నిర్ణయించారని, 1,400 మందిని బలిగొన్న ఆమెకు అలా జరగాల్సిందే’నని, ‘యూనస్ చాలా క్రూరమైన మనిషి. తీర్పు కొన్ని రోజుల ముందే రావాల్సింది. కానీ, హసీనా పెళ్లి రోజు అని తెలిసి ఆయనే తేదీని నవంబర్ 17కు మార్చారు’.. ఇలా రకరకాలుగా సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష పడింది. మానవత్వంతో వ్యవహరించాల్సిందిపోయి.. క్షమించరాని నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరిపిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు.. హసీనాను దోషిగా తేల్చింది. సోమవారం ఆమెకు మరణ శిక్షను విధించింది. గత ఏడాది జులై – ఆగస్టులో విద్యార్థుల నిరసనల అణచివేత సమయంలో దాదాపు 1400 మంది మృతిచెందారని ఐసీటీ న్యాయమూర్తి తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని చంపేయాలని హసీనా ఆదేశాలు ఇచ్చారని అన్నారు.
The workers of #Dhaka hitting the streets right now. In solidarity with Bangladeshi students. In resistance to police violence & state terror. This is how we do it comrades. Solidarity is our weapon. pic.twitter.com/JSEOr4Cwej
— GhostofDurruti (@DurrutiRiot) July 17, 2024
ఆగస్టు 5వ తేదీన ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని.. వారిపై హెలిక్యాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని హసీనా ఆదేశించారని విచారణ సందర్భంగా దర్యాప్తు నివేదికను వారు చదివి వినిపించారు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హసీనా మద్దతుదారులు యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అప్రమత్తమైన బంగ్లా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
తనపై వచ్చిన ఆరోపణలను కోర్టు తీర్పు ముందు షేక్ హసీనా ఖండించారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను హసీనా కొట్టిపారేశారు. ‘నేను 10 లక్షల మంది రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చాను. కానీ, వారు నన్ను మానవ హక్కులను ఉల్లంఘించానని ఆరోపిస్తున్నారు?’ అని అన్నారు. ఐసీటీ తీర్పు ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి హసీనా మాట్లాడారు. ఈ సందర్భంగా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యూనస్ ప్రభుత్వం తన పార్టీ అయిన అవామీ లీగ్‌ను పూర్తిగా నాశనం చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘మా పార్టీని నాశనం చేయడం అంత సులభం కాదు. అవామీ లీగ్.. అధికార దురాక్రమణదారుల జేబుల్లోంచి వచ్చిందికాదు.. అట్టడుగు స్థాయి నుంచి పుట్టుకొచ్చింది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
We need powerful women prime minister like Sheik Hasina who keep her country first and have a progressive mind pic.twitter.com/UkDoBGmLkl
— Ved (@Vedtw33t) April 30, 2025