మెగా యంగ్ వార్

నేటి నుంచి అండర్-19 ప్రపంచకప్
గయానా: భవిష్యత్తు తారలను ప్రపంచానికి పరిచయం చేసే అండర్-19 ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. కరోనా కష్టకాలంలో పటిష్ట ఏర్పాట్ల మధ్య శుక్రవారం నుంచి ఐసీసీ మెగా టోర్నీకి తెరలేవనుండగా.. మొత్తం 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్.. ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఉగాండాతో కలిసి గ్రూప్-బిలో ఉంది. లీగ్ దశ ముగిసేసరికి గ్రూప్‌లో టాప్‌లో ఉన్న రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. గత టోర్నీ ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న యువ భారత్.. ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ కూడా ట్రోఫీపై కన్నేశాయి. కెప్టెన్ యష్ ధుల్, తెలుగు ఆటగాడు షేక్ రషీద్, హర్నూర్ సింగ్, రాజ్వర్ధన్పై యువ భారత్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. వామప్ మ్యాచ్‌లతో పాటు ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ విజయంలో వీరు కీలక పాత్ర పోషించారు. అండర్-19 స్థాయిలో సత్తాచాటి టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న వాళ్లు కోకొల్లలుగా ఉండటంతో యువ ఆటగాళ్లంతా తమ కల సాకారం చేసుకునేందుకు తెగించి కొట్లాడేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం జరుగనున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆతిథ్య వెస్టిండీస్ తలపడనుండగా.. శనివారం దక్షిణాఫ్రికాతో యువ భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీకి విండీస్ మొదటిసారి ఆతిథ్యం ఇస్తుండగా.. పటిష్ట బయోబబుల్లోనూ జింబాబ్వే, పాకిస్థాన్ బృందాల్లో కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన రేపుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

