బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 13:21:39

U19 వరల్డ్‌కప్‌: భారత్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌

U19 వరల్డ్‌కప్‌: భారత్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌

2010 అండర్‌-19 ప్రపంచకప్‌ తర్వాత మెగా టోర్నీలో పాక్‌ జట్టు భారత్‌పై విజయం సాధించలేదు.

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 ప్రపంచకప్‌-2020లో రసవత్తర పోరుకు వేళైంది. మెగాటోర్నీ తొలి సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడేందుకు యువ భారత్‌ సన్నద్ధమైంది.  టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ నజీర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రెండు జట్లు తమ తుది జట్లలో మార్పులు చేయకుండానే బరిలో దిగుతున్నాయి.  పాక్‌తో ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌లో  యువ భారత్‌ సారథి  ప్రియం గార్గ్‌ జట్టును ఏ విధంగా నడిపిస్తాడో ఆసక్తికరంగా మారింది.  2010 అండర్‌-19 ప్రపంచకప్‌ తర్వాత మెగా టోర్నీలో పాక్‌ జట్టు భారత్‌పై విజయం సాధించలేదు. 

పిచ్‌, వాతావరణం:

పోచెఫ్‌స్ట్రూమ్‌లో వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పడం కష్టం. మంగళవారం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్‌ రైద్దెతే.. గ్రూప్‌ స్టేజ్‌లో ఎక్కువ విజయాలు సాధించిన భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఆరంభంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించినా.. బంతి పాతబడ్డాక స్పిన్నర్లు ప్రభావం చూపగలరు.
logo