ఆంటిగ్వా: వెస్టిండీస్‌లో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ ఆడుతున్న భారత జట్టును కరోనా మహమ్మారి నీడలా వెంటాడుతున్నది. ఇప్పటికే పలువురు భారత ప్లేయర్లు కరోనా మహమ్మారి బారినపడి ఐసోలేషన్లోకి వెళ్లారు. తాజాగా మరో కీలక ప్లేయర్ నిషాంత్ సింధూకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. బంగ్లాదేశ్ జట్టుతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇలా జరుగడం భారత జట్టుకు ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.
అయితే, గతంలో కరోనా బారినపడిన ఆటగాళ్లు ఇప్పుడు కోలుకున్నారని, బంగ్లాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు వాళ్లు అందుబాటులో ఉంటారని భారత టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఇప్పుడు నిషాంత్ సింధూకు కరోనా వచ్చిందని, అయినా ఆందోళన అక్కర్లేదని, గతంలో కొవిడ్ బారినపడ్డ ఆటగాళ్లు కోలుకున్నారని తెలిపింది.
బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కల్లా స్కిప్పర్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ ఎస్కే రషీద్ అందుబాటులోకి వస్తారని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గత వారం కూడా ఐర్లాండ్‌తో లీగ్ మ్యాచ్‌కు ముందు అండర్-19 జట్టులోని ఆరుగురు భారత ప్లేయర్లు కరోనా బారినపడ్డారు. దాంతో తర్వాత ఆటల కోసం మేనేజ్మెంట్ హుటాహుటిన భారత్ నుంచి ఐదుగురు ప్లేయర్లను వెస్టిండీస్‌కు పిలిపించింది.