ICC Test Rankings | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టుల్లో బ్యాక్‌టుబ్యాక్ సెంచరీలతో చెలరేగిన భారత స్టార్ వికెట్ కీపర్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఏడో ప్లేస్‌కు చేరుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు సాధించాడు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సైతం టాప్-20లోకి ప్రవేశించాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ 82 ఓవర్లలోనే 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా.. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. లీడ్స్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. అంతకుముందు జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసిన ఏకైక వికెట్ కీపర్.
లీడ్స్ టెస్ట్‌లో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 134, సెకండ్ ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. అదే సమయంలో శుభ్‌మాన్ గిల్ ఐదు స్థానాలు ఎగబాకి టాప్ 20కి చేరుకున్నాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో గిల్ సెంచరీ చేశాడు. టాప్ 20 టెస్ట్ బ్యాట్స్‌మెన్ జాబితాలో భారతదేశం నుంచి ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే ఉన్నారు. పంత్, గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ నాలుగోస్థానంలో ఉన్నాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి సైతం సెంచరీ చేశాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు జరుగలేదు. హెడింగ్లీ టెస్ట్‌లో 14వసారి ఐదు వికెట్లు తీసిన తర్వాత భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన బెన్ డకెట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈక్రమంలో టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఓలీ పోప్ మూడు స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి, జామీ స్మిత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 27వ స్థానానికి చేరుకున్నారు. ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జో రూట్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ మూడోస్థానంలో ఉన్నాడు. లీడ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బాల్, బ్యాట్‌తోనూ రాణించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో మూడుస్థానాలు మెరుగుపరుచుకొని ఐదోప్లేస్కు చేరాడు. టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక-బంగ్లాదేశ్‌తో మధ్య తొలి టెస్ట్ డ్రాగా ముగియగా.. ఈ మ్యాచ్‌లో రాణించిన పలువురు ఆటగాళ్ల ర్యాంకింగ్స్నూలో మార్పులు జరిగాయి. గాలెలో టెస్టులో 163 పరుగులు చేసిన బంగ్లా ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోగా.. నజ్ముల్ హొస్సేన్ శాంటో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసి 21 స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకున్నాడు.