దుబాయ్: ఆసియాకప్‌లో ఆకట్టుకుంటున్న టీమ్ఇండియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరింది. 116 పాయింట్లతో భారత్ రెండో ర్యాంక్‌కు ఎగబాకగా.. శ్రీలంక చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ (115) అగ్రస్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు పరిమితమైంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా 118 పాయింట్లతో టాప్ ర్యాంక్ దక్కించుకుంది.