ICC T20 Rankings | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా యువ సంచలన బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ బ్యాట్స్‌మెన్ ర్యాకింగ్స్లో రెండోస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఆస్ట్రేలియా ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ రెండు, మూడోస్థానాల్లో ఉన్నారు.
టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. 856 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) 815 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ 829, తిలక్ వర్మ 804, సూర్యకుమార్ ఖాతాల్లో 739 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బౌలర్ల ర్యాకింగ్స్లో వెస్టిండీస్‌కు చెందిన అకిల్ హుస్సేన్ 707 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి 706 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 705 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. వానిందు హసరంగా (శ్రీలంక) 700 పాయింట్లతో నాలుగు, ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) 694 పాయింట్లతో ఐదోస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా ప్లేయర్ రవి బిష్ణోయ్ 674 పాయింట్లతో ఆరోస్థానంలో ఉన్నాడు.
లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 653 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత ఈ ఫార్మాట్లో మ్యాచులేమీ ఆడకపోవడంతో స్థానాలు మారలేదు. పాకిస్తాన్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో ఉన్నది. ఈ సిరీస్‌లో రాణించిన టీమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్‌తో పాటు బౌలర్ జాకబ్ డఫీకి ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి. సీఫెర్ట్ 20 స్థానాలు మెరుగుపరుచుకొని 13వ ప్లేస్‌కు చేరుకున్నాడు. అలెన్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్‌కు చేరశాడు. రెండు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసిన డఫీ కొరియర్లో తొలిసారిగా 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.