మరింత రసవత్తరంగా ఐసీసీ టోర్నీలు.. వన్డేల్లో మూడు దశల్లో మ్యాచ్‌లు
వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028లో నిర్వహించనున్న టీ20 వరల్డ్‌కప్ పోటీలను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ ఈ టోర్నీల్లో సమూల మార్పులు చేసింది. వన్డే వరల్డ్‌కప్‌ను మూడు దశల్లో, పొట్టి పోరులో కొత్తగా సూపర్-10ను విస్తరించనున్నట్టు ఈ మేరకు ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
- టీ20ల్లో సూపర్-10
ఎడిన్బర్గ్ (స్కాట్లాండ్) : వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028లో నిర్వహించనున్న టీ20 వరల్డ్‌కప్ పోటీలను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ ఈ టోర్నీల్లో సమూల మార్పులు చేసింది. వన్డే వరల్డ్‌కప్‌ను మూడు దశల్లో, పొట్టి పోరులో కొత్తగా సూపర్-10ను విస్తరించనున్నట్టు ఈ మేరకు ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 14 జట్లు పాల్గొనబోయే వన్డే ప్రపంచకప్‌లో 12-14 మధ్య ర్యాంకు ఉన్న 3 జట్లు ముందుగా ‘సూపర్ సిరీస్’ అనే తొలిరౌండ్ మ్యాచ్‌లు ఆడతాయి. అందులో అగ్రస్థానాన నిలిచిన జట్టు మాత్రమే ముందంజ వేస్తుంది. రెండో దశలో 12 జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి.
ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లతో పాటు రెండు గ్రూపుల్లోని తర్వాతి బెస్ట్ టీమ్ ‘సూపర్ 7’ స్టేజ్‌కు చేరుతుంది. ఈ దశలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్‌కు వెళ్తాయి. టీ20ల విషయానికొస్తే.. గతంలో నిర్వహించిన సూపర్-8కు బదులు కొత్తగా సూపర్-10ను చేర్చారు. 20 జట్లు తలపడే ఈ టోర్నీలో నాలుగేసి జట్లు ఐదు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ గ్రూపుల్లో టాప్-2 టీమ్స్ సెమీస్‌కు అర్హత సాధిస్తే 2, 3 స్థానాల్లో ఉన్న జట్లు వేరే గ్రూపులోని అదే స్థానంలో ఉన్న జట్లతో ‘ఎలిమినేటర్’ ఆడతాయి. ఎలిమినేటర్‌లో గెలిచిన రెండు జట్లు సెమీస్‌కు ముందంజ వేస్తాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

