ICC Rankings | ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు కసిగో రబాడ నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టాడు. బుమ్రా ఏకంగా రెండు ర్యాంకులు దిగజారి మూడోస్థానానికి చేరాడు. మిర్పూర్లో జరిగిన తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై రబాడ తొమ్మిది వికెట్లు కూల్చాడు. దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడు ర్యాంకులు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రబాడ 300 టెస్ట్ వికెట్ల మైలురాయిని సైతం అందుకున్నాడు. రబాడ మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. కెరీర్లో తొలిసారిగా 2018 జనవరిలో టాప్ టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. 2019 ఫిబ్రవరిలో నెంబర్ వన్ స్థానం నుంచి దిగజారాడు. ఇదిలా ఉండగా.. టీమిండియా బౌలర్ బుమ్రా 846 పాయింట్లతో మూడోస్థానాకి చేరాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ నెంబర్-2 స్థానంలో ఉన్నాడు. టాప్-4లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఐదో స్థానంలో ఉన్నారు. స్పిన్నర్ రవీంద్ర జడేజా రెండుస్థానాలు దిగజారి.. ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ 9వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రెండు, మూడు టెస్టుల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన జట్టును 2-1 తేడాతో నోమన్ గెలిపించాడు.
దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకొని తొలిసారిగా టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. పుణె టెస్టులో భారత్‌పై సిరీస్‌ను గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ వ్యక్తిగత ర్యాంక్‌ను మెరుపరుచుకున్నాడు. 13 వికెట్లు తీసిన సాంట్నర్ 30 స్థానాలు ఎగబాకి.. ప్రస్తుతం 44వ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ బ్యాటింగ్‌లో మూడో స్థానానికి చేరాడు. టీమిండియా ఆటగాళ్లలో జైస్వాల్ ఒక్కడే టాప్-10లో కొనసాగుతున్నాడు. ఇక నెంబర్ వన్ బ్యాటర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ కొనసాగుతున్నాడు.