దుబాయ్: టీమ్ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్ 759 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న గిల్..తన ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాడు. విరాట్ కోహ్లీ(715), కెప్టెన్ రోహిత్‌శర్మ(707) వరుసగా ఎనిమిది, తొమ్మిది ర్యాంక్‌ల్లో ఉన్నారు.
చిరకాల ప్రత్యర్థి పాక్‌తో పోరులో కోహ్లీ సూపర్ సెంచరీతో చెలరేగగా, రోహిత్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు ఒక్కో ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నారు. 2019 తర్వాత ముగ్గురు భారత బ్యాటర్లు టాప్-10లో ఉండటం ఇది తొలిసారి. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్(863) నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.