ICC : మైదానంలో హద్దు మీరి.. అపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆగ్రహానికి గురయ్యే క్రికెటర్ల సంఖ్య ఈమధ్య ఎక్కువవుతోంది. ప్రత్యర్థి ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం లేదంటే వికెట్ తీశాక కవ్వించేలా సంబురాలు చేసుకోవడం ద్వారా చిక్కుల్లో పడుతున్నారు ఆటగాళ్లు. తాజాగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాస్చ్ (Corbin Bosch) కూడా రిఫరీ, ఐసీసీ కోపానికి బలయ్యాడు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ను ఔట్ చేశాక దురుసుగా సెండాఫ్ ఇవ్వడంతో అతడికి ఒక డీ మెరిట్ పాయింట్ విధించింది ఐసీసీ.
కంగారూ గడ్డపై జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా సిరీస్ సమం చేసింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో డెవాల్డ్ బ్రెవిస్ సూపర్ సెంచరీతో భారీ స్కోర్ చేసిన సఫారీ టీమ్.. తదుపరి ప్రత్యర్థిపై 53 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్ 17వ ఓవర్లో ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ డ్వారుషీని ఔట్ చేసిన తర్వాత చేత్తో పెవిలియన్ దారి చూపిస్తూ అవేశంగా సంబురాలు చేసుకున్నాడు బాస్చ్. అంతేకాదు అతడు అసభ్యకరంగా కొన్ని మాటలు కూడా అనడం వీడియోలో రికార్డు అయింది. సఫారీ పేసర్ తీరును తప్పుబట్టిన రిఫరీ ఐసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశాడు.
Corbin Bosch’s send-off after dismissing Ben Dwarshuis has now landed him in trouble.#CorbinBosh #AUSvsSA #ICC #CricTracker pic.twitter.com/vNZtkT2Gsv
— CricTracker (@Cricketracker) August 13, 2025
మ్యాచ్ అనంతరం విచారణ సందర్భంగా బాస్చ్ తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో, ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం అతడిక ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపుచ్చింది. మొదట బ్రెవిస్ శతకంతో జట్టుకు కొండంత స్కోర్ అందించగా.. 20 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన బాస్చ్ సఫారీ విజయంలో కీలకమయ్యాడు. యువ పేసర్ క్వెనా మఫాకా సైతం మూడేసీ వికెట్లతో ఆసీస్ పతనంలో భాగమయ్యాడు.
డెవాల్డ్ బ్రెవిస్ (125 నాటౌట్)