ICC | కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్లు షహీన్ షా అఫ్రిది, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్‌కు ఐసీసీ షాకిచ్చింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ముగ్గురూ.. సఫారీ ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించినందుకు గాను క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.
సఫారీ బ్యాటర్ బ్రీట్జ్కెతో షహీన్ వాగ్వాదానికి దిగాడు. షకీల్, కమ్రాన్.. సౌతాఫ్రికా సారథి టెంబ బవుమా రనౌట్ అయినప్పుడు అతడికి దగ్గరగా వచ్చి సంబురాలు చేసుకున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐసీసీ.. ఈ ముగ్గురూ ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించారని వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా విధించింది.