ICC : ఇంగ్లండ్‌తో పొట్టి సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ప్రెనెలాన్ సుబ్రయెన్( Prenelan Subrayen)కు భారీ ఊరట లభించింది. అతడి బౌలింగ్ యాక్షన్ వివాదాస్పదంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తోసిపుచ్చింది. ఐసీసీ ప్రమాణాలకు లోబడే ప్రెనెలాన్ బౌలింగ్ చేస్తున్నాడని అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో.. స్పిన్నర్‌తో సహా ప్రొటిస్ బోర్డు సైతం సంతోషం వ్యక్తం చేసింది.
ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా.. అతడి బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో, ఆగస్టు 26న బ్రిస్బేన్‌లోని జాతీయ క్రికెట్ కేంద్రంలో అతడి బౌలింగ్‌ను పర్యవేక్షించారు. అయితే.. ఐసీసీ నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టుగానే సుబ్రయెన్ బౌలింగ్ చేస్తాన్నాడని ఐసీసీ ప్రతినిధులు గమనించారు. అతడు మోచేయిని 15 డిగ్రీల కోణంలోనే ఉంచుతూ బంతిని సంధిస్తున్నాడని తెలిపారు.
🚨 𝑵𝑬𝑾𝑺 𝑨𝑳𝑬𝑹𝑻 🚨
South African spinner Prenelan Subrayen has been given the all-clear on his bowling action, which was questioned in the first ODI against Australia. ✅🇿🇦#Cricket #SouthAfrica #Sportskeeda pic.twitter.com/EJwUEkmrI7
— Sportskeeda (@Sportskeeda) September 7, 2025
దక్షిణాఫ్రికా స్పిన్నర్ ప్రెనెలాన్ సుబ్రయెన్ బౌలింగ్ యాక్షన్ అమోదయోగ్యంగానే ఉందని ఈరోజు ఐసీసీ ధ్రువీకరించింది. అంతర్జాతీయ క్రికెట్లో అతడు ఎంచక్కా బౌలింగ్ చేయవచ్చు అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాదే ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ప్రెనెలాన్ .. తొలి టెస్టు జింబాబ్వేపై, మొదటి వన్డే మ్యాచ్ ఆస్ట్రేలియాపై ఆడాడు. బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీ క్లీన్చిట్ ఇవ్వడంతో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ స్క్వాడ్‌లో ప్రెనెలాన్కు చోటు దక్కే అవకాశముంది. ఇరుజట్ల మధ్య సెప్టెంబర్10న తొలి మ్యాచ్ జరుగనుంది.