క్రైస్ట్‌చర్చ్: పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఖుష్దిల్ షా(Khushdil Shah)కు .. మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో అతను ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ప్రవర్తనా నియమావళి లెవల్ 2 ను ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది. మైదానంలో అనుచిత రీతిలో మరో ప్లేయర్‌ను ఢీకొట్టడం వల్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. దీనిపై ప్రకటన రిలీజ్ చేసింది. ఖుష్దిల్కు క్రమశిక్షణా రికార్డులో మూడు డీమెరిట్ పాయింట్లు కూడా జతకూడాయి. గడిచిన 24 నెలల కాలంలో ఇదే తొలి తప్పుగా చిత్రీకరించారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో.. కివీస్ బౌలర్ జకరీ ఫోక్స్‌ను బ్యాటర్ ఖుష్దిల్ ఢీకొట్టాడు. వికెట్ల మధ్య పరుగు తీస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తప్పును అంగీకరిస్తున్నట్లు ఖుల్దిల్ చెప్పాడు. ఐసీసీ విధించిన జరిమానాను ఆమోదించాడు.
Pakistan all-rounder Khushdil Shah fined for breaching ICC Code of Conduct, gets 3 demerit points pic.twitter.com/dm1xXxhxvS
— Zsports (@_Zsports) March 18, 2025
లెవల్ 2 ఉల్లంఘన ప్రకారం.. ఆటగాళ్లకు 50 నుంచి 100 శాతం వరకు మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. లేదంటే రెండు సస్పెన్షన్ పాయింట్లు జోడిస్తారు. ఒకవేళ 24 నెలల్లో డీమెరిట్ పాయింట్లు నాలుగుకు చేరితే, అప్పుడు ఆ క్రికెటర్‌ను బ్యాన్ చేస్తారు. రెండు సస్పెన్షన్ పాయింట్లు ఉంటే ఒక టెస్టు లేదా రెండు వన్డేలు, లేదా రెండు టీ20ల నుంచి నిషేధం విధిస్తారు.