ICC CWC 2023: గెలిచినోళ్లకెంత..? ఓడినోళ్లకెంత..? క్రికెట్ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ వివరాలివే..!
ICC CWC 2023: భారత్ - న్యూజిలాండ్ మధ్య సెమీస్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఐసీసీ కీలక ప్రకటన చేసింది. వరల్డ్ కప్ ప్రైజ్ మనీతో పాటు టోర్నీ గెలిచిన విజేతలకు, రన్నరప్‌తో పాటు మూడు, నాలుగు స్థానాల్లో వచ్చిన జట్లు, లీగ్ దశలో ఆడిన మ్యాచ్‌లలో ఆడిన జట్లకూ పంపిణీ ఎలా ఉండనుందో వెల్లడించింది.
ICC CWC 2023: నెలన్నరగా ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరిస్తున్న వన్డే వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది. ఇదివరకే లీగ్ దశ ముగిసిన ఈ మెగా టోర్నీలో రేపటి నుంచి (నవంబర్ 15) నుంచి నాకౌట్ దశ మొదలుకానుంది. ముంబైలోని వాంఖడే వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య సెమీస్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. వరల్డ్ కప్ ప్రైజ్ మనీతో పాటు టోర్నీ గెలిచిన విజేతలకు, రన్నరప్‌తో పాటు మూడు, నాలుగు స్థానాల్లో వచ్చిన జట్లు, లీగ్ దశలో ఆడిన మ్యాచ్‌లలో ఆడిన జట్లకూ పంపిణీ ఎలా ఉండనుందో వెల్లడించింది.
2023 ప్రపంచకప్ ప్రైజ్ మనీని ఐసీసీ పదిమిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్దేశించింది. భారత కరెన్సీలో అది సుమారు రూ. 74.15 కోట్లు. ఈ మొత్తం నుంచే విన్నరప్, రన్నరప్‌తో పాటు పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా పంపిణీ చేయనుంది. వరల్డ్ కప్ టోర్నీని కైవసం చేసుకునే జట్టుకు 4 లక్షల యూఎస్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 33.29 కోట్లు. ఫైనల్ పరాజితులకు రెండు యూఎస్ డాలర్లు (సుమారు రూ. 16.64 కోట్లు) దక్కనుంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు తలా రూ. 6.6 కోట్లు అందనుంది. గ్రూప్ స్టేజ్‌లో ఎలిమినేట్ అయిన ఆరు జట్లకూ తలా రూ. 83 లక్షలు దక్కనుండగా గ్రూప్ దశలో ప్రతీ మ్యాచ్ విజేతలకు ఒక్కో మ్యాచ్‌కు రూ. 33 లక్షల చొప్పున ఐసీసీ అందించనుంది. ఈ మేరకు ఐసీసీ ఎక్స్ (ట్విటర్) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
💰 Prize money awarded
🗓️ Schedule and reserve days
📺 How to watch every matchYour one-stop shop for everything about the #CWC23 knockout stage ⬇️https://t.co/5IZ7z2cMhb
— ICC (@ICC) November 14, 2023
పది జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సెమీస్ చేరుకోగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, శ్రీలంకలు గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించాయి. నవంబర్ 15న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగాల్సి ఉండగా 16న కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికా-ఆస్ట్రేలియాలు ఢీకొంటాయి. ఈ రెండు మ్యాచ్‌లలో విజేతలు నవంబర్ 19న అహ్మదాబాద్‌లో తుదిపోరులో అమీతుమీ తేల్చుకుంటాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

