Shubhman Gill | చరిత్ర సృష్టించిన శుభ్ మన్ గిల్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు
Shubman Gill | భారత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు సాధించాడు. వరుసగా రెండో నెలలో ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు.
Shubhman Gill | ఫార్మాట్లతో సంబంధం లేకుండా.. నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి నెలా అందిస్తున్న అత్యుత్తమ ప్లేయర్ అవార్డును గిల్ రెండో సారి అందుకున్నాడు. సెప్టెంబర్ నెలలో ప్రదర్శనకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు గిల్ ఎంపికయ్యాడు. తద్వారా మన దేశం నుంచి రెండోసారి ఐసీసీ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న తొలి, ఏకైక ప్లేయర్‌గా శుభ్‌మన్ రికార్డుల్లోకి ఎక్కాడు. గత నెలలో ఆసియా కప్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ దంచికొట్టిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్, భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌తో పోటీపడిన గిల్ ఈ రేసులో వారిద్దరినీ వెనక్కి నెట్టి టాప్‌లో నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ గిల్‌పై టీమ్ మేనేజ్మెంట్తో పాటు అభిమానులు భారీ ఆశలు పెట్టుకోగా.. మెగాటోర్నీకి ముందు అతడు డెంగ్యూ బారీన పడ్డాడు. దీంతో టీమ్ఇండియా ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు గిల్ దూరమయ్యాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో పాటు.. ఢిల్లీలో అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు గిల్ అందుబాటులో లేకుండా పోయాడు.
అయితే డెంగ్యూ నుంచి కోలుకున్న గిల్ ప్రస్తుతం దాయాది పాకిస్థాన్‌తో శనివారం జరిగే పోరుకు సిద్ధమవుతున్నాడు. జట్టు సభ్యులందరి కంటే ముందే అహ్మదాబాద్ (పాక్‌తో మ్యాచ్ జరిగే వేదిక)కు చేరుకున్న గిల్ నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. అంతా సవ్యంగా సాగితే అతడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది వన్డే క్రికెట్లో ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ పరుగులు చేసిన గిల్.. భారత భవిష్యత్ స్టార్‌గా మన్ననలు అందుకుంటున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

