టీ20 వరల్డ్ కప్ 2021 ప్రస్థానం ముగిసిపోయింది. 16 టీమ్స్‌లో ఒక టీమ్ కప్పును ఎగరేసుకుపోయింది. ఫైనల్స్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా.. టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని తొలిసారి ముద్దాడింది.
అయితే.. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భాగంగా జరగిన మ్యాచ్‌లన్నింటిలో హైలైట్‌గా నిలిచిన.. బాగా రాణించిన ఆటగాళ్లతో ఐసీసీ ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. దానికి మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్(Most Valuable Team of the Tournament) అనే పేరు పెట్టింది.
ఆ టీమ్‌కు సభ్యులుగా 11 మందిని వివిధ టీమ్స్ నుంచి ఎంచుకుంది. కెప్టెన్, వికెట్ కీపర్, ఓపెనర్స్, బౌలర్స్.. చివరకు రిజర్వ్డ్ ప్లేయర్‌ను కూడా సెలెక్ట్ చేసింది ఐసీసీ.
అయితే.. ఈ టీమ్‌లో భారత్‌కు చోటు దక్కలేదు. టీమిండియా నుంచి ఒక్క ప్లేయర్‌కు కూడా టీమ్‌లో ప్లేస్ దక్కలేదు. టీమ్ కెప్టెన్‌గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను సెలెక్ట్ చేసింది. ఓపెనర్‌గా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సెలెక్ట్ చేసింది. వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌ను ఎంచుకుంది.
డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), బాబర్ ఆజమ్(కెప్టెన్), అసలంక, మార్కరమ్, అలీ, హసరంగా, ఆడమ్ జంపా, హాజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, నోర్ట్జీ, రిజర్వ్డ్ ప్లేయర్ షహీన్ అఫ్రిదీని ఐసీసీ సెలెక్ట్ చేసింది.
ఇందులో టీ20 వరల్డ్ కప్ 2021 చాంపియన్ ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు ప్లేయర్స్, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, శ్రీలంక నుంచి ఇద్దరు, సౌత్ ఆఫ్రికా నుంచి ఇద్దరు, న్యూజిలాండ్ నుంచి ఒకరు, పాకిస్థాన్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసింది.
The @upstox Most Valuable Team of the Tournament has been announced 🌟
— ICC (@ICC) November 15, 2021
Does your favourite player feature in the XI?
Read: https://t.co/J3iDmN976U pic.twitter.com/SlbuMw7blo
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
David Warner | కొన్నిసార్లు సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తాడంతే.. వార్నర్‌పై మాజీ క్రికెటర్ కామెంట్
ఆస్ట్రేలియాకు 13 కోట్లు.. ఇండియా, నమీబియాకు ప్రైజ్‌మనీ ఎంతంటే?
షూలో కూల్‌డ్రింక్ పోసుకుని.. తాగేసి చిందేసిన ఆసీస్ ప్లేయర్లు.. వీడియో