ఆస్ట్రేలియాకు 13 కోట్లు.. ఇండియా, నమీబియాకు ప్రైజ్‌మనీ ఎంతంటే?

దుబాయ్: ఆస్ట్రేలియా జట్టు తొలి సారి టీ20 వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్టరీ నమోదు చేసింది. అయిదు సార్లు వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మొదటిసారి టీ20ని కైవసం చేసుకున్ననది. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు 13.1 కోట్ల ప్రైజ్‌మనీ వశమైంది. టీ20 వరల్డ్‌కప్ మొత్తం ప్రైజ్‌మనీ 42 కోట్లు కాగా, 16 జట్లకు ఆ అమౌంట్‌ను పంపిణీ చేశారు. చాంపియన్‌గా నిలిచి ఆస్ట్రేలియాకు మొత్తం 13.1 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. దీంట్లో టోర్నీ గెలిచినందుకు 11.9 కోట్లు, 4 లీగ్ మ్యాచ్‌లు గెలిచినందుకు 1.2 కోట్లు దక్కాయి. రన్నరప్ న్యూజిలాండ్‌కు 7.15 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. ఫైనల్లో చేరినందుకు 5.95 కోట్లు, సూపర్-12లో 4 మ్యాచ్‌లు గెలిచినందుకు కివీస్‌కు అదనంగా 1.2 కోట్లు దక్కాయి. సెమీస్‌కు చేరిన ఇంగ్లండ్, పాక్‌కు చెరో 3 కోట్లు దక్కాయి. 5 మ్యాచ్‌లు నెగ్గిన పాకిస్థాన్‌కు అదనంగా 1.5 కోట్లు చేరాయి. ఇండియా, నమీబియా, స్కాట్లాండ్కు చెరో 1.42 కోట్ల ప్రైజ్‌మనీ వశమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

