హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ హవా కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో శ్రీనిధి 3-2 తేడాతో నెరోకా ఎఫ్‌సీపై విజయం సాధించింది.
డెక్కన్ జట్టు తరఫున ఫైసల్, డేవిడ్, గాబ్రియల్ తలా ఒక గోల్ చేశారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ (29 పాయింట్లు) తర్వాత శ్రీనిధి (28 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది.