MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను అభిమానులతో తరచూ పంచుకుంటూ ఉంటాడు. రెండు రోజుల క్రితం కేరళలో టెక్నో ఎడ్యుకేషనలిస్ట్ ప్రొఫెసర్ కేకే అబ్దుల్ గఫర్ ఆత్మకథ జాన్ సాక్షి(Njaan Sakshi) పుస్తకాన్నిధోనీ ఆవిష్కరించాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘నేను కాలేజీకి అస్సలు వెళ్లలేదు. కానీ, చదువులో, కెరీర్లో రాణించానని అనుకుంటున్నా. టీచింగ్ అనేది ఒక వృత్తి మాత్రమే కాదు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే ఒక కళ. పిల్లలకు వాళ్ల బలాలు, బలహీనతల గురించి చెప్తారు. అందుని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. నేను చదువుకునే రోజుల్లో టీచర్లకు పెద్ద అభిమానిని అని’ ధోనీ తెలిపాడు.
టికెట్ కలెర్ట్గా పనిచేసిన ధోనీ ధనాధన్ ఆటతీరుతో భారత జట్టులో చోటు సంపాదించాడు. ఫినిషర్‌గా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. టీమిండియాను నడిపించిన విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ అగ్రస్థానంలో ఉంటాడు. అతని కెప్టెన్సీలో తొలి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2011 వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్‌నూ ధోనీ సారథిగా చైన్నై సూపర్ కింగ్స్‌కు నాలుగు సార్లు ట్రోఫీని అందించాడు. ఈ దిగ్గజ ఆటగాడు 2020 ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.