అతడంటే నాకు గౌరవం లేదు.. విండీస్ లెజెండ్‌పై విరుచుకుపడిన క్రిస్ గేల్

దుబాయ్: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్.. మాజీ ప్లేయర్ కర్ట్లీ ఆంబ్రోస్‌పై విరుచుకుపడ్డాడు. అతడంటే తనకు ఏమాత్రం గౌరవం లేదని అన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ తుది జట్టులో గేల్ ఆటోమేటిక్ చాయిస్ కాదని విండీస్ మాజీ బౌలర్ అయిన ఆంబ్రోస్ అన్నాడు. దీనిపై గేల్ చాలా ఘాటుగా స్పందించాడు. తాను క్రికెట్లోకి వచ్చిన కొత్తలో ఆంబ్రోస్ అంటే చాలా గౌరవం ఉండేదని, కానీ ఆ తర్వాత అతడు తన గురించి చాలా నెగటివ్ కామెంట్స్ చేశాడని, ఇక ఇప్పుడు అతనిపై తనకెలాంటి గౌరవం లేదని గేల్ స్పష్టం చేశాడు.
నేను కర్ట్లీ ఆంబ్రోస్ గురించి మాట్లాడుతున్నా. కేవలం అతని గురించే. ఒకప్పుడు అతన్ని నేను చాలా గౌరవించేవాడిని. వచ్చిన కొత్తలో నేను అతన్నే ఆదర్శంగా తీసుకున్నాను. కానీ అతడు రిటైరైనప్పటి నుంచీ ఏం జరిగిందో కానీ నాపై అన్నీ ప్రతికూల వ్యాఖ్యలే చేస్తున్నాడు. కేవలం మీడియాలో అటెన్షన్ కోసం అతడిలా చేస్తున్నాడేమో నాకు తెలియదు. ఇప్పుడు మీకు నేను చెబుతున్నాను. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌కు అతడంటే అస్సలు గౌరవం లేదు. ఇదే విషయాన్ని మీరు అతనికి చెప్పండి అని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో గేల్ అన్నాడు. ఆంబ్రోస్‌తో నా బంధం తెగింది అని స్పష్టం చేశాడు. ఎప్పుడైనా అతన్ని కలిస్తే ఇలా నెగటివ్‌గా మాట్లాడటం ఆపేయమని, టీమ్‌ను సపోర్ట్ చేయమని చెబుతానని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

