ముంబై: వచ్చే నెల 2 నుంచి ముంబైలో జరుగబోయే డబ్ల్యూటీఏ ముంబై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సహజ యామలపల్లికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కింది. ప్రస్తుతం భారత మహిళల సింగిల్స్‌లో నెంబర్ వన్ ర్యాంకు కల్గిన సహజ.. కొద్దిరోజుల క్రితం పూణెలో జరిగిన బిల్లీ జీన్ కింగ్ కప్‌లో భారత్ రెండో స్థానంతో ముగించడంలో కీలకపాత్ర పోషించింది.