న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్రపంచ చాంపియన్షిప్నుంచి ఆచంట శరత్ కమల్ తప్పుకోవడంతో భారత జట్టుకు సాథియన్ సారధ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబరు 9 వరకు చైనాలో జరిగే ఈ పోటీలకు మంగళవారం భారత జట్టును ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ పోటీలనుంచి తప్పుకుంటున్నట్టు శరత్ కమల్ వెల్లడించాడు. ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ మూడు స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టులో హైదరాబాదీ స్టార్ ఆకుల శ్రీజ చోటు దక్కించుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో శరత్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన శ్రీజ.. అదే జోరు ఇక్కడ కూడా కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొంది.