హైదరాబాద్, ఆట ప్రతినిధి: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. గురువారం చత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మీడియం పేసర్ రవితేజ (6/13) ధాటికి చత్తీస్‌గఢ్ 19.1 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది.
శశాంక్సింగ్ (51) అర్ధసెంచరీ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రవితేజ ఆరు వికెట్లతో రికార్డు ప్రదర్శన కనబరిచాడు. 13 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టిన రవితేజ.. దీపక్ పునియా (6/14) రికార్డును బద్దలు కొట్టాడు. నిర్దేశిత లక్ష్యఛేదనలో నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 98 పరుగులు చేసింది. రాహుల్‌సింగ్(25 నాటౌట్), చందన్(25) ఆకట్టుకున్నారు.