కోల్‌కతా: సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో హైదరాబాద్ అదరగొడుతున్నది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిని గెలుచుకున్న ఆ జట్టు.. ఎలైట్ గ్రూప్-బీలో అగ్రస్థానాన నిలిచింది. గురువారం కోల్‌కతాలో జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జమ్మూకశ్మీర్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లలో నితిన్ సాయి యాదవ్ (3/17), కెప్టెన్ మిలింద్ (3/31) రాణించారు. ఛేదనను హైదరాబాద్ 15.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి పూర్తిచేసింది. తనయ్ త్యాగరాజన్ (50) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు.