చెన్నై: బుచ్చిబాబు క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరింది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా హర్యానాతో జరిగిన సెమీస్‌లో హైదరాబాద్ జట్టు.. 91 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఆట ఆఖరిరోజు 272 పరుగుల ఛేదనలో హర్యానా.. 181 రన్స్‌కే కుప్పకూలింది. హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నితిన్ సాయి యాదవ్.. (7/44) ఏడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో హైదరాబాద్.. టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ 11తో ఈనెల 6 నుంచి తలపడనుంది.