కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం జాదవ్‌పూర్ యూనివర్సిటీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని మహారాష్ట్ర రెండు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. ఓపెనర్లు అర్శిన్ కులకర్ణి(54 బంతుల్లో 89 నాటౌట్, 12ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీకి తోడు కెప్టెన్ పృథ్వీషా(36 బంతుల్లో 66, 9ఫోర్లు, 3సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకమయ్యారు.
పసలేని హైదరాబాద్ బౌలింగ్‌కు తోడు పేలవ ఫీల్డింగ్‌ను అనుకూలంగా మలుచుకుంటూ షా ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు. కులకర్ణితో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గత ఐపీఎల్లో అమ్ముడుపోని షా..ఈసారి ఎలాగైనా ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాడు. రక్షణ్‌రెడ్డి, అజయ్‌దేవ్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత కెప్టెన్ మిలింద్(35 నాటౌట్), తనయ్ త్యాగరాజన్(32) రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 191/8 స్కోరు చేసింది. జలజ్ సక్సేనా(2/25) రెండు వికెట్లు తీశాడు.