హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ తైక్వాండో టోర్నీకి హైదరాబాద్ విద్యార్థి బొల్లం భువన్కుమార్ ఎంపికయ్యాడు. మర్రి లక్ష్మణరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో చదువుతున్న భువన్కుమార్ జేఎన్టీయూ తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు.
నవంబర్ 6 నుంచి 9 వరకు అమృత్సర్లోని గురునానక్ వర్సిటీలో జరగనున్న పోటీల్లో భువన్ తలపడనున్నాడు. ఈ సందర్భంగా జేఎన్టీయూ అధికారులు భువన్ను అభినందించారు