హైదరాబాద్: ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (173) భారీ శతకానికి తోడు రోహిత్ (84), అభిరత్ (68), హిమతేజ (60), తనయ్ (53) అర్ధ శతకాలతో మెరవడంతో ఉప్పల్ వేదికగా పుదుచ్చేరితో జరుగుతున్న రంజీ ఎలైట్ గ్రూప్ గ్రూప్-బీ మూడో మ్యాచ్ లో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 536/8 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పుదుచ్చేరి.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టపోయి 24 పరుగులు చేసింది.
గంభీర్ నేర్చుకుంటాడు: రవిశాస్త్రి
పూణె: స్వదేశంలో 12 ఏండ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శకులు విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అతడికి అండగా నిలిచాడు. పూణె టెస్టులో ఓటమి తర్వాత శాస్త్రి మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్‌కు ఇది అత్యంత మధురమైన విజయం. గంభీర్ కొద్దిరోజుల క్రితమే హెడ్‌కోచ్ బాధ్యతలను చేపట్టాడు. అత్యంత క్రేజ్ కలిగిన భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉండటం అంటే సాధారణ విషయం కాదు. కోచ్‌గా అతడికి ఇది ఆరంభ దశ. త్వరలో అతడు నేర్చుకుంటాడు’ అని వ్యాఖ్యానించాడు.