హైదరాబాద్, ఆట ప్రతినిధి: యూఏఈ వేదికగా జరిగే అండర్-19 ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన అవినాశ్రావు, మురుగన్ అభిషేక్ ఎంపికయ్యారు. వచ్చే నెల 8వ తేదీ నుంచే మొదలయ్యే టోర్నీ కోసం సెలెక్టర్లు శనివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు.
యువ భారత జట్టుకు ఉదయ్ శరణ్ కెప్టెన్‌గా, వైస్‌కెప్టెన్‌గా స్వామికుమార్ పాండే వ్యవహరించనున్నారు. గత కొంత కాలంగా వికెట్‌కీపర్, బ్యాటర్ అవినాశ్, అభిషేక్ నిలకడగా రాణిస్తూ వస్తున్నారు. వీర్దిదరి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. అండర్-19 ఆసియాకప్ టోర్నీని అత్యధికంగా ఎనిమిది సార్లు గెలిచిన భారత్ మరోమారు టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతున్నది. భారత్‌కు ఎంపికైన అవినాశ్, అభిషేక్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు ప్రత్యేకంగా అభినందించారు.
భారత అండర్-19 టీమ్: ఉదయ్ శరణ్ (కెప్టెన్), అవినాశ్రావు, అభిషేక్, కుమార్పాండే, అర్శిణ్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్రమయూర్, సచిన్‌దాస్, ప్రియాంశు, ముశిర్ఖాన్, దనుశ్గౌడ, , ఇన్నేశ్ మహాజన్, ఆరాధ్యశుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.