హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రో పంజా లీగ్ అరంగేట్రం సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా లీగ్ జరుగనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం జరిగిన వేలంలో మొత్తం 180 మంది ప్లేయర్లను ఆరు జట్లు ఎంచుకున్నాయి. లీగ్‌లో బరిలోకి దిగుతున్న కిరాక్ హైదరాబాద్ టీమ్ 10 కేటగిరీల్లో 30 మందిని జట్టులోకి తీసుకుంది. జట్టు సమతూకంతో ఉందని, ప్లేయర్లు లీగ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఫ్రాంచైజీ యజమాని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అహ్మద్ ఫైజాన్ అలీ అన్నాడు.