హైదరాబాద్, ఆట ప్రతినిధి : సొంతగడ్డపై జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో సీజన్లో హైదరాబాద్ హీరోస్ విజేతగా నిలిచింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హైదరాబాద్.. 41-17తో ముంబై డ్రీమర్స్‌ను ఓడించి రెండో సీజన్ టైటిల్ గెలుచుకుంది.
ఆట ఆరంభంలో డ్రీమర్స్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ తర్వాత పుంజుకున్న హైదరాబాద్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు. ఆట అర్ధభాగం ముగిశాక హీరోస్ మ్యాచ్‌పై పూర్తిస్థాయిలో పట్టుసాధించి చాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెంగళూరు బ్రేవ్ హార్ట్స్.. 22-19తో చెన్నై బుల్స్‌ను ఓడించింది.