భువనేశ్వర్ : ఇండియన్ సూపర్‌లీగ్‌లో భాగంగా శుక్రవారం ఒడిశా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1-3 తేడాతో ఓడిపోయింది. ఇసాక్ వన్లరూఫెల 33వ నిమిషంలో ఒడిశాకు తొలి గోల్ అందించగా, విరామానికి ముందు నిమ్ దోర్జి తమంగ్(45ని.) చేసిన గోల్‌తో స్కోరు సమమయింది.
ద్వితీయార్ధంలో నిమ్ దోర్జీ చేసిన సెల్ఫ్ గోల్‌తో ఒడిశా మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి క్షణాల్లో ఇంజ్యురీ టైమ్‌లో డీగొ మారిసియో(94ని.) చేసిన గోల్‌తో ఒడిశా తిరుగులేని ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకుంది.