
కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 31 : దళిత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళితబంధు పథకంపై కూకట్పల్లి దళిత ఐక్యవేదిక కేంద్ర కమిటీ, డివిజన్ కమిటీ సభ్యులు నోడల్ అధికారితో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదన్నారు. దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గంలో అర్హులైన వందమందికి దళితబంధు పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, స్వయం ఉపాధి పొందడం, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం ఆర్థికంగా అభివృద్ధిని సాధించే దిశగా దళితబంధు దోహదం చేస్తున్నదన్నారు. దళితులు దరఖాస్తులు చేసుకుంటే దశల వారీగా అందరికీ ఫలాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీనివాస్‌రావు, సతీశ్ గౌడ్, రవీందర్ రెడ్డి, నర్సింహ యాదవ్, సత్యనారాయణ, సబీహాబేగం, శిరీష, ఐక్యవేదిక నేతలు బోడ నరసింగరావు, ఎడ్ల సత్యనారాయణ, బండి సుధ, నపారి చంద్రశేఖర్, జెల్లా రాము, ఆయా డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
శారీరక దారుఢ్యానికి ఓపెన్ జిమ్‌లు
శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు ఓపెన్ జిమ్‌లను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, నూతనంగా అభివృద్ధి చేసిన పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు పగుడాల శిరీషాబాబురావు, మందడి శ్రీనివాస్‌రావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీలో నిరుపయోగంగా ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
కుల వృత్తులకు ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని.. రజకుల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. సోమవారం బాలాజీనగర్ డివిజన్లోని ముళ్లకత్వ చెరువు వద్ద రూ.27 లక్షలతో నిర్మించిన దోబీఘాట్‌ను ఎమ్మెలే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు పగుడాల శిరీషాబాబురావు, మందడి శ్రీనివాస్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం రజకుల లాండ్రీ షాపులకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటును ఇస్తున్నదన్నారు. కుల వృత్తులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, ప్రభాకర్ గౌడ్, కృష్ణారెడ్డి, సాయిబాబా, అంబేద్కర్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి తదితరులు ఉన్నారు.
షాదీముబారక్ చెక్కులు పంపిణీ
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదల కన్నీళ్లు తుడుస్తున్నాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధి మల్లికార్జునకాలనీలోని సదాశివ హైస్కూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనతో పాటు కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షాదీముబారక్ పథకంలో 114 మందికి, కల్యాణలక్ష్మి పథకంలో 25 మందికి మొత్తం 139 మందికి వారు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజల మనుస్సును సీఎం కేసీఆర్ దోచుకున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల పక్షపాతిగా నిలిచందన్నారు. నిరుపేదలకు అండగా నిలిచేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అందిస్తున్న ఘనత ముఖ్యంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరేందర్‌గౌడ్, కర్రె జంగయ్య, మక్కల నర్సింగ్, బల్వంత్‌రెడ్డి, కర్రె లావణ్య లతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.