హైదరాబాద్, ఆట ప్రతినిధి: జైపూర్ వేదికగా జరుగుతున్న జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా రెండు పతకాలతో మెరిశాడు. శనివారం జరిగిన బాలుర అండర్-16 విభాగం 2వేల మీటర్ల వ్యక్తిగత రేసులో ఆశీర్వాద్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ అండర్-16 స్ప్రింట్ ఈవెంటులో చిరాయుశ్ పట్వర్ధన్, రామకృష్ణతో కలిసి ఆశీర్వాద్ రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.