చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్‌కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన తమ తొలి లీగ్‌మ్యాచ్‌లో బ్లాక్‌హాక్స్ 14-16, 11-15, 7-15తో చెన్నై బ్లిట్జ్ చేతిలో ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్‌లో ఓడిన చెన్నై మలి పోరులో అద్భుతంగా పుంజుకుంది. ముఖ్యంగా అఖిన్, లియాండ్రో జోస్..బ్లాక్‌హాక్స్ పాయింట్లను బ్లాక్ చేశారు. కెప్టెన్ రంజిత్‌సింగ్ పాస్‌లతో ఆకట్టుకోగా హైదరాబాద్ పుంజుకునే ప్రయత్నం చేసింది.