Asian Games-2023 | ఈ ఆసియా క్రీడల్లో భారత్కు ఖాయమైన వంద పతకాలు.. చరిత్రలో తొలిసారి
Asian Games-2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే భారత్ పతకాల సంఖ్య 91 కి చేరింది. అందులో 21 స్వర్ణాలు, 33 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి. వివిధ క్రీడాంశాల్లో మరో 9 పతకాలు ఖాయమయ్యాయి.
హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే భారత్ పతకాల సంఖ్య 91 కి చేరింది. అందులో 21 స్వర్ణాలు, 33 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి. వివిధ క్రీడాంశాల్లో మరో 9 పతకాలు ఖాయమయ్యాయి. దాంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో వంద పతకాలు చేరనున్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ ఏకంగా 100 పతకాలు సాధించడం ఇదే తొలిసారి కాబోతోంది.
కాగా, సెప్టెంబర్ 24న ప్రారంభమైన ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఆది నుంచి గతం కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రోజు నుంచి భారత పతకాల జోరు కొనసాగుతున్నది. దాంతో ఆసియాడ్ చరిత్రలో తొలిసారిగా ఇప్పుడు భారత్ ఖాతాలో 100 పతకాలు చేరబోతున్నాయి. గతంలో 2018 ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 70 పతకాలే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఇప్పటికే ఆ రికార్డు బద్దలు కాగా, ఇప్పుడు ఏకంగా 100 పతకాల మార్కు దిశగా భారత్ దూసుకుపోతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

