T20 WC Prize money | మహిళల పొట్టి ప్రపంచకప్ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
టీ20 వరల్డ్ కప్ 2023 ఛాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. దాదాపు ఒక మిలియన్ డాలర్లు. అంటే.. రూ. 8.3 కోట్లు. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా రూ. 4.13 కోట్లు గెలుచుకుంది. అయితే.. పురుషుల టీ20 ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పోల్చితే ఆస్ట్రేలియాకు రూ.5 కోట్లు తక్కువ ప్రైజ్‌మనీ లభించింది.
T20 WC Prize money : దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన మహిళల టీ20 వరల్డ్ కప్ 2023 ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. రెండోసారి వరుసగా మూడుసార్లు పొట్టి ప్రపంచకప్ గెలిచిన మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది. విజేతగా నిలిచిన ఆసీస్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. దాదాపు ఒక మిలియన్ డాలర్లు. అంటే.. రూ. 8.3 కోట్లు. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా రూ. 4.13 కోట్లు గెలుచుకుంది.
అయితే.. పురుషుల టీ20 ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పోల్చితే ఆస్ట్రేలియాకు రూ.5 కోట్లు తక్కువ ప్రైజ్‌మనీ లభించింది. ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లకు రూ.1.73 కోట్లు ఇస్తారు. ఇంగ్లండ్, భారత మహిళల జట్టుకు తలా 1.73 కోట్ల రూపాయిలు అందుతాయి.
పురుషుల టీ20 జట్టుకు..
పోయిన ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. దాంతో, ఆ జట్టు రూ. 13.25 కోట్ల ప్రైజ్‌మనీ దక్కించుకుంది. రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌కు 8 లక్షల డాలర్లు ( రూ. 6.6 కోట్లు) బహుమతిగా లభించాయి. సెమీఫైనల్ చేరిన భారత్, న్యూజిలాండ్ జట్లకు రూ.3.25 కోట్లను ఐసీసీ ముట్టజెప్పింది. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గెలుపొందింది.
ఐదు ఐసీసీ ట్రోఫీలు
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఆదివారం జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. దాంతో, ఆ జట్టు ఆరోసారి సగర్వంగా పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అత్యధిక ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి కెప్టెన్‌గా ఆ జట్టు కెప్టెన్ మేగ్ లానింగ్ చరిత్ర సృష్టించింది. లానింగ్ కెప్టెన్సీలో ఆసీస్ మహిళల జట్టు ఐదు సార్లు జగజ్జేతగా నిలిచింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు 2014, 2018, 2020, 2023లో పొట్టి ప్రపంచకప్, 2023లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అంతేకాదు 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఛాంపియన్‌గా అవతరించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 156 రన్స్ చేసింది. ఆ జట్టులో బేత్ మూనీ హాఫ్ సెంచరీ (74 నాటౌట్)తో రాణించింది. ఛేజింగ్‌లో సఫారీ జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. లారా వాల్వార్ట్ ఫిఫ్టీ (61) బాదినా ఆసీస్ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో, సఫారీ జట్టు ఏమాత్రం కోలుకోలేకపోయింది.
ఇవి కూడా చదవండి
Meg Lanning | ఐదు ఐసీసీ ట్రోఫీలతో పాంటింగ్, ధోనీలను దాటేసిన ఆసీస్ కెప్టెన్ లానింగ్
Australia | ఆసీస్ సిక్సర్.. ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం
‘ప్రయత్న లోపమే ఓటమికి కారణం’
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

