హామిల్టన్(న్యూజిలాండ్): ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఇబ్బందుల్లో పడింది. టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ టామ్ లాథమ్(63), విల్ యంగ్(42) శుభారంభంతో మెరుగ్గా కనిపించిన కివీస్ అదే ఒరవడి కొనసాగించలేకపోయింది.
ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మంచి పునాది వేశారు. అయితే ఇంగ్లండ్ పేసర్లు మాథ్యూ పాట్స్(3/75), అట్కిన్సన్(3/55) ధాటికి 172/2తో మెరుగ్గా కనిపించిన కివీస్ 231 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో రచిన్వ్రీంద్ర(18), మిచెల్ (14), బ్లండెల్(21), ఫిలిప్స్(5) విఫలమయ్యారు. ఆఖర్లో సాంట్నర్(50 నాటౌ ట్) రాణించడంతో మెరుగైన స్కోరు అందుకుంది.
తన కెరీర్లో ఆడుతున్న కివీస్ వెటరన్ టిమ్ సౌథీ..వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ సరసన నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో గేల్(98)తో కలిసి సంయుక్తంగా సౌథీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కివీస్ తరఫున 107వ టెస్టు ఆడుతున్న సౌథీ 10 బంతుల్లో మూడు సిక్స్‌లతో 23 పరుగులు సాధించాడు.