హైదరాబాద్, నమస్తే తెలంగాణ/మలక్‌పేట: అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచిన దివ్యాంగ ప్లేయర్లు రమావత్ కోటేశ్వర్, కుడుముల లోకేశ్వరీకి తగిన గుర్తింపు లభించింది. ఢిల్లీలో ఇంటర్నేషనల్ వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టోర్నీలో నల్లగొండకు చెందిన కోటేశ్వర్ అదరగొట్టగా, పోర్చుగల్‌లో జరిగిన ఐవాస్ వరల్డ్ గేమ్స్ డిస్కస్‌త్రోలో లోకేశ్వరి కాంస్య పతకం సాధించింది.
వీరిని శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎంతో అండగా నిలుస్తుందని, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేముందు లోకేశ్వరీకి ప్రభుత్వం తరపున రూ.లక్ష అందించటం జరిగిందని ఆయన తెలిపారు.