హాంకాంగ్ : భారత యువ షట్లర్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఈ ఇద్దరితో పాటు మరో యువ ఆటగాడు ఆయుష్ శెట్టి కూడా తొలి రౌండ్ విఘ్నాన్ని అధిగమించాడు. కానీ మహిళల సింగిల్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు అనుపమ ఉపాధ్యాయ మొదటి రౌండ్‌కే ఇంటిబాట పట్టారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రణయ్.. 21-17, 21-14తో లు గ్వాంగ్జు (చైనా) ను చిత్తుచేశాడు.
సేన్.. 22-20, 16-21, 21-15తో వాంగ్ జు వీ (తైవాన్)ని ఓడించాడు. ఆయుష్.. 15-21, 21-19, 21-13తో సు లి యాంగ్ (చైనీస్ తైఫీ)ని మట్టికరిపించాడు. ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్.. లక్ష్య సేన్‌తో ఆడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో సింధు.. 21-15, 16-21, 19-21తో అన్‌సీడెడ్ డెన్మార్క్ షట్లర్ లినె క్రిస్టోఫెర్సెన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అనుపమ.. 17-21, 22-20, 14-21తో మియాజకీ (జపాన్) చేతిలో పోరాడి ఓడింది.