న్యూయార్క్: అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగులా(Jessica Pegula).. యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో కరోలినా ముచోవ్పై 1-6 6-4 6-2 స్కోరు తేడాతో విజయం సాధించింది. హోమ్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన జెస్సికా.. సెమీస్‌లో తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. తొలి సెట్‌ను కోల్పోయిన జెస్సికా.. ఆ తర్వాత తన పవర్ గేమ్‌తో ఆకట్టుకున్నది. ఫైనల్లో రెండో సీడ్ ప్లేయర్ సబలెంకాతో జెస్సికా తలపడనున్నది.
Believe it, Jessica Pegula!
You’re in a Grand Slam final! pic.twitter.com/4VYlp8GtPq
— US Open Tennis (@usopen) September 6, 2024
గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించడం జెస్సికాకు ఇదే మొదటిసారి. మరో వైపు సబలెంకాకు మాత్రం యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి వరుసగా రెండోసారి ప్రవేశించింది. సెమీస్‌లో అమెరికా ప్లేయర్ ఎమ్మా నవరోపై 6-3, 7-6 స్కోరు తేడాతో సబలెంకా విజయం నమోదు చేసింది. సెరీనా విలయమ్స్ తర్వాత వరుసగా రెండుసార్లు యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించిన క్రీడాకారిణిగా సబలెంకా నిలిచింది.