చెన్నై: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో యువ భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 4-3(పెనాల్టీ షూటౌట్) తేడాతో బెల్జియంపై అద్భుత విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
చివరి నిమిషం వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ నాకౌట్ పోరులో బెల్జియంపై భారత్‌దే పైచేయి అయ్యింది. టీమ్ఇండియా తరఫున శారదా తివారీ, అంకిత్పాల్, రోహిత్ గోల్స్ చేశారు. ఆదివారం జరిగే సెమీస్‌లో భారత్..జర్మనీతో తలపడుతుంది. మరోవైపు మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీలో భారత్ 4-0తో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. పూల్-సీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అమ్మాయిలు సత్తాచాటారు.