Hockey India : ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ సమీపిస్తోంది. నెదర్లాండ్స్ వేదికగా ఆగస్టులో ఈ మెగా టోర్నీ జరుగనుంది. దాంతో, మంగళవారం 20 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది హాకీ ఇండియా (Hockey India). అంతర్జాతీయ అనుభవమున్న సీనియర్లు, ప్రతిభావంతులైన జూనియర్లకు స్క్వాడ్‌లో చోటు దక్కింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం అందించిన హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh) సారథ్యంలో భారత హాకీ జట్టు వరల్డ్‌కప్ బరిలో దిగనుంది.
హాకీ వరల్డ్‌కప్ కోసం సమతూకంతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసింది హాకీ ఇండియా. డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా 20 మందితో కూడిన పటిష్టమైన బృందాన్ని ప్రకటించింది. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మన్‌ప్రీత్ సింగ్ ఈ మెగాటోర్నీకి ఎంపికయ్యాడు. గోల్ కీపర్లుగా మోహిత్ హెచ్ఎస్, సూరజ్ కర్కేరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. యువకులు రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ సత్తా చాటాలని ఉవ్విళ్లురుతున్నారు.
Ready for the Biggest Stage. 🇮🇳🏑
Here’s the Indian Men’s Squad for the FIH Hockey World Cup Belgium & Netherlands 2026. 💙
Carrying the hopes of a nation, the squad is ready to challenge the world’s best and write a new chapter in Indian hockey. 🏆
Go well, Team India! 💪… pic.twitter.com/fdN6OWKVoE
— Hockey India (@TheHockeyIndia) July 21, 2026
‘ఇది పూర్తిగా సమతూకంతో కూడిన స్క్వాడ్. అంతర్జాతీయ అనుభవమున్న ఆటగాళ్లు, ప్రతిభను చాటుకున్న జూనియర్లను తీసుకున్నాం. ఒక్కో మ్యాచ్ గెలవడంపైనే దృష్టి సారిస్తున్నాం. ఇదే దృక్ఫథంలో వరల్డ్‌కప్ బరిలో దిగుతున్నాం అని ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫల్టన్ పేర్కొన్నాడు.
నెదర్లాండ్స్‌లో ఆగస్టు 15 నుంచి 30వ తేదీ వరకూ పురుషుల హాకీ వరల్డ్‌కప్ జరుగనుంది. గ్రూప్ డీలో ఉన్న భారత్ లీద్ దశలో ఇంగ్లండ్, వేల్స్, పాకిస్థాన్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభం రోజే వేల్స్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. ఆగస్టు 17న ఇంగ్లండ్‌తో, చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఆగస్టు 19న హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
హాకీ వరల్డ్‌కప్ స్క్వాడ్ : గోల్ కీపర్స్ – మోహిత్ హెచ్ఎస్, సూరజ్ కర్కేరా.
డిఫెండర్లు – జర్మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్దీప్ సివాచ్.
మిడ్ఫీల్డర్స్ – రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లలాఏ, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్.
ఫార్వర్డ్స్ – దిల్‌ప్రీత్ సింగ్, శిలానంద్ లక్రా, సుఖ్జిత్ సింగ్, మన్దీప్ సింగ్, అభిషేక్.