APAAR ID | అపార్ ఐడీ సమ్మతి పత్రాన్ని జాతీయస్థాయిలో సవరించాలి.. సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు సూచన..!
APAAR ID | అపార్ ఐడీ (APAAR ID) సమ్మతి పత్రాన్ని (Consent Form) జాతీయస్థాయిలో సవరించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కు సుప్రీంకోర్టు (Supreme Court) సూచించింది. అపార్ ఐడీ కన్సెంట్ ఫామ్‌పై ఒరిస్సా హైకోర్టు (Orissa High Court) ఇచ్చిన ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ను ఆదేశించనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.
APAAR ID : అపార్ ఐడీ (APAAR ID) సమ్మతి పత్రాన్ని (Consent Form) జాతీయస్థాయిలో సవరించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కు సుప్రీంకోర్టు (Supreme Court) సూచించింది. అపార్ ఐడీ కన్సెంట్ ఫామ్‌పై ఒరిస్సా హైకోర్టు (Orissa High Court) ఇచ్చిన ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ను ఆదేశించనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. పిటిషనర్లు లేవనెత్తిన తల్లిదండ్రుల సమ్మతి, డేటా పరిరక్షణకు సంబంధించిన ఆందోళనలను కూడా CBSE పరిశీలించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
అపార్ ఐడీ పథకం చెల్లుబాటును సవాల్ చేస్తూ నలుగురు విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పథకం విద్యార్థులను ఆధార్ పొందడాన్ని తప్పనిసరి చేస్తోందని, గోప్యతపై ఆందోళనలను రేకెత్తిస్తోందని పిటిషన్లో వాదించారు. జాతీయ విద్యా విధానం-2020 కింద ప్రవేశపెట్టిన అపార్.. ప్రతి విద్యార్థికి మార్క్షీట్లు, సర్టిఫికెట్లు, ఇతర విజయాలు వంటి విద్యా సంబంధిత రికార్డులను డిజిటల్‌గా నిల్వ చేయడానికి ఒక ప్రత్యేకమైన 12-అంకెల జీవితకాల గుర్తింపు సంఖ్యను అందిస్తుంది.
2025 డిసెంబర్లో ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం సవాలు చేయలేదని, అందువల్ల దాని ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

